మంద కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం

50చూసినవారు
మంద కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం
మంద కృష్ణ నాయకత్వంలో పోరాటం చేయటం వల్లనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యమైందని, దానికి నిదర్శనం సుప్రీంకోర్టు సైతం వర్గీకరణను అంగీకరిస్తూ తీర్పు చెప్పిందని ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. గురువారం చంద్రుగొండ ప్రధాన సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు తీర్పును హార్షిస్తూ ఎమ్మార్పీఎస్ శ్రేణులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.