భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ మోటర్ రిపేర్ రావడంతో గత నాలుగు రోజుల నుంచి వాటర్ సౌకర్యం పంచాయతీ పరిధిలో నిలిచిపోయింది. పంచాయతీ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో వర్షంలో కూడా పంచాయతీ మోటర్ రిపేర్ చేయడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.