కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

71చూసినవారు
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
విత్తన విక్రయాల్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత తనిఖీ అధికారి, మణుగూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తాతారావు డీలర్లను హెచ్చరించారు. అశ్వారావుపేట రైతు వేదికలో మంగళవారం ఆయన విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్టాక్ బోర్డులో వివరాలు సూచించాలని, రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :