సెల్ టవర్ తొలగించాలని ఆందోళన

69చూసినవారు
సెల్ టవర్ తొలగించాలని ఆందోళన
భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో గల ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సెల్ఫోన్ టవరును తొలగించాలని ఆ కాలనీ వాసులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ సెల్ టవరును వెంటనే తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. కాగా ఇదే విషయంపై సదరు ఇంటి యజమానికి కాలనీవాసులు ఈ విషయాన్ని వివరించి, టవరును తొలగించాలని కాలనీ వాసులు కోరారు.