చర్లలో సీపీఐ శతజయంతి వేడుకలు
ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సీపీఐ మొదటి నుంచి పనిచేస్తూనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం చర్ల మండల కేంద్రంలో సీపీఐ శతజయంతి వేడుకలు నిర్వహించారు. భూమి, భుక్తి కోసం, పేద ప్రజల బ్రతుకుల బాగుకోసం సీపీఐ తొలినాళ్ల నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు.