స్వామి వారికి కల్ప వృక్ష వాహన సేవ

62చూసినవారు
స్వామి వారికి కల్ప వృక్ష వాహన సేవ
భద్రాచలంలో స్వామివారికి ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం స్వర్ణపూత కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ జరిపారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంపై కొలువుదీర్చి తాతగుడి సెంటర్ లోని గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సేకరించిన పుట్టమట్టిని మరో వాహనంపై ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలతో మృత్సం గ్రహణం నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.