ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

70చూసినవారు
ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్
ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు. శనివారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ నుండి లక్ష్మినగరం మీదుగా ములకపాడు వరకు సిఆర్పిఎఫ్, పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్