శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు

83చూసినవారు
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్ల సిఐ రాజగోపాల్ అన్నారు. శనివారం చర్ల పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరినొకరు దూషించుకుంటూ అల్లర్లు సృష్టిద్దామని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిఒక్కరు నడుచుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిఆర్పిఎఫ్ అధికారి రాజ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్