అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల అసహనం
కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు అసహనం వ్యక్తం చేశారు. దమ్మపేట ఎస్ఐ పనితీరు సరిగా లేదన్నారు. మరోసారి ఎస్ఐ పనితీరు తేడాగా ఉంటే తనకు చెప్పమని బాధితులకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి రోడ్డు విస్తరణ పనుల్లో పక్షపాతం వహించవద్దని పారదర్శకంగా పనులు చేయాలని ఆదేశించారు.