పిడుగుపడి ఇద్దరు కూలీలు మృతి
కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలో మంగళవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. జగ్గారానికి చెందిన 15 మంది గిరిజనులు పొలాల్లోకి కూలి పనులకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారిపై పిడుగు పడింది. ఈ ఘటనలో సున్నం అనూష (23), నాగశ్రీ (23) స్పాట్లోనే మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.