సుజాతనగర్ మండలం నుంచి 7 గ్రామపంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్లో కలపొద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు 20న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏడు పంచాయతీలను కలపడం వల్ల ఉపాధి అవకాశాలు పోతాయని, రైతులు పొలాలను అమ్ముకుని కూలీలుగా మారే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.