పినపాక నూతన తాహసిల్దార్ గా అద్దంకి నరేష్ మంగళవారం నూతన బాధ్యతలు చేపట్టారు. నరేష్ భద్రాచలం ఐటిడిఏ ఏపీవోగా విధులు నిర్వహిస్తూ పినపాక తాహసిల్దార్ గా డిటి సమ్మయ్య నుండి పదవి బాద్యతలు స్వీకరించారు. మండలంలో స్థానిక స్థితిగతులపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.