ఆశ్రమ పాఠశాల మామకన్ను నందు భోజన విరామ సమయంలో గురువారం టీపీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం గుండాల మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో టిపిటిఎఫ్ మండల కమిటీ సభ్యులు బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు నేటికీ నిర్వహించనందున వాటి సాధనకై సంక్షేమ శాఖ ముట్టడి కోసం పోరు బాటలో ఉపాధ్యాయులు అందరూ 6 జూలై 2024 న పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.