త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

68చూసినవారు
త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా
ఇల్లందు సిఎస్పీ బస్తీలోని దేవులపల్లి యాకయ్య నగర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నబీ మాట్లాడుతూ ఐదేళ్లుగా అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు త్రాగునీరు అందించడంలో అధికారులు విఫలం చెందాలన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్