కామేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామంలో బుధవారం అయ్యప్ప స్వామి నగర సంకీర్తన భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు స్వాములు పిప్పెల్ల శ్రీను స్వామి, కంప సాటి కృష్ణస్వామి, స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. స్వాములు సురేష్ సత్యనారాయణ రమేషు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.