అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప–2’ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. వసూళ్ల పరంగా పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పింది. అలాగే ఈ సినిమాలోని పీలింగ్స్ పాట సోషల్ మీడియాలో ఎంత హిట్టయిందో అందరికీ తెలుసు. అయితే పీలింగ్స్ పాటకు కొచ్చిన్‌లోని ఓ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్ స్టెప్పులు వేశారు. విద్యార్థినులతో కలసి సరదాగా డ్యాన్స్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది.