పాకిస్థాన్, బంగ్లాదేశ్ బంధం బలపడుతోంది. బంగ్లా ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా గద్దె దిగడంతో తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇందులో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలికార్గో షిప్ రాగా ఆదివారం మరో సరకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్ట్‌కు చేరుకుంది.