ఇటీవల సంచలనం సృష్టించిన ‘లాపతా లేడీస్’ సినిమాను ఇవాళ సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా లింగ సమానత్వం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, రిజిస్ట్రీ అధికారుల కోసం ఈ మూవీని అత్యున్నత న్యాయస్థానంలో ప్రదర్శించనున్నారు. ఇందులో అమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా పాల్గొననున్నారు.