బంతి భుజానికి తగిలినా LBW ఇవ్వొచ్చు! (వీడియో)

1562చూసినవారు
క్రికెట్‌లో LBW అంటే మనకు తెలిసింది లెగ్‌ బిఫోర్‌ వికెట్‌. కానీ ఇందులో లెగ్‌ అంటే కేవలం కాలు మాత్రమే కాదు. మీ బాడీలో ఏ పార్ట్‌ అయినా సరే స్టంప్స్‌ను తగులుతుందనుకున్న బాల్‌ బ్యాట్స్‌మన్‌లోని ఏ భాగానికి తగిలినా అంపైర్‌ ఔటివ్వవచ్చు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓసారి సచిన్‌ భుజానికి బాల్‌ తగిలితే అంపైర్‌ డారెల్‌ హెయిర్‌ ఔట్‌గా ఇచ్చారు. రూల్‌ ప్రకారం దీనిని ఔట్‌గా ఇచ్చే హక్కు అంపైర్‌కు ఉంటుంది.