ప‌క్షుల దాహం తీరుద్దాం

572చూసినవారు
ప‌క్షుల దాహం తీరుద్దాం
రోజూ ఉదయాన్నే మీ పెరట్లో, మేడ పైన, బాల్కనీల్లో పక్షులకు కనపడేలా ఒక గిన్నెలో నీటిని పోసి ఉంచండి. వీలైతే వాటి పక్కన కొన్ని గింజలు కూడా పెట్టండి. రోజుకు రెండు సార్లు ఆ నీటిని మార్చండి. ఉదయం సాయంత్రం వేళల్లో పక్షులు ఆహారం వెతుక్కుంటూ గూళ్ల నుంచి బయటకు వస్తాయి. మీకు కుదరనప్పుడు పిల్లల్ని నీరు పెట్టేలా ప్రోత్సహించండి. అలా చేయటం వల్ల ఉపయోగమేంటో వివరించండి. మూగజీవుల పట్ల ప్రేమ, బాధ్యత తెలుస్తుంది.