ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టరంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపాం. మా అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించింది’’ అని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు తెలిపారు.