స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం: ఏపీ హోటల్స్ అసోసియేషన్

84చూసినవారు
స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం: ఏపీ హోటల్స్ అసోసియేషన్
ఏపీలో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌.వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్,రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని వారు పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో సంస్థల ప్రతినిధులతో ఆగస్ట్‌లో మూడు సార్లు చర్చలు జరిపామని, తమ అభ్యంతరాలకు జొమాటో అంగీకరించగా, స్విగ్గీ ఒప్పుకోలేదని లేదని తెలిపారు. నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్