కాంగ్రెస్-BRS మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. ఎప్పటికైనా BRS కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కి మీడియా ఫోబియా పట్టుకుందన్నారు. ఎప్పుడూ న్యూస్ లో, సోషల్ మీడియాలో కనిపించాలనే తపన తప్ప మరేదానికి కేటీఆర్ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.