బంగాళాఖాతంలో అల్పపీడనం

57చూసినవారు
బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ అల్పపీడనం వాయవ్యదిశగా ప్రయాణించి ఈనెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఆది, సోమవారాల్లో కుండపోతగా వర్షాలు కురవనుండటంతో దక్షిణ రాష్ట్రానికి రెండు రోజుల రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

ట్యాగ్స్ :