బీజేపీ జిల్లా శాఖ ఈ నెల 13,14,15 తేదీల్లో "మహా సభ్యత్వ అభియాన్" నిర్వహిస్తోందని జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. గ్రామీణ యువత నుండి మద్దతు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టాలని వంద మంది సభ్యులను చేర్పించిన వారికి ఎంపీ డి. కె. అరుణమ్మ చేతుల మీదుగా సన్మానం ఉంటుందన్నారు.