దేవరకద్ర: ప్రజావాణి ఫిర్యాదులనుసత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

82చూసినవారు
దేవరకద్ర: ప్రజావాణి ఫిర్యాదులనుసత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కరెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 76 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించి ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్