మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని 74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా.. బీబీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయం, గ్రామ పంచాయితీ పరిధిలోని రెండు ప్రాధమికోన్నత పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవ బంజారా సేన సంఘం వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్, రాజు నాయక్, గ్రామ సర్పంచ్ గోవింద్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయలు సుబ్బయ్య, జ్ఞానేశ్వర్ సార్, అంగన్వాడి టీచర్ అనసూయ, భరతమ్మ, పంచాయతీ కార్యదర్శి రాకేష్, బాబీ నాయాక్, మోహన్ నాయక్, గ్రామ యువకులు పాల్గొన్నారు.