

జడ్చర్ల: కంచె లేని ట్రాన్స్ ఫార్మర్లు.. ప్రమాదానికి నిలయాలు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని గౌతాపూర్ డబుల్ బెడ్ రూముల ముందు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లకు కంచే ఏర్పాటు చేయాలని గురువారం గ్రామస్తులు కోరుతున్నారు. కంచే లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని, చిన్నపిల్లలు విద్యుత్ వైర్లను తాకితే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు.