రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం (ఈనెల 30న) అమిస్తాపూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(మూడా) తరఫున భూత్పూర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వద్ద గురువారం రాత్రి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు. ఫ్లై ఓవర్ కు ముడా తరఫున డిజిటల్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ బ్యానర్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.