ఈ నెల 9, 10 న ఓటర్ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర బోయి గురువారం తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇది మరో అవకాశం అన్నారు. ఓటర్ లిస్టులో ఓటరుగా నమోదు కాకపోయి ఉంటే ఫామ్-6 ద్వారా పోలింగ్ బూత్ వద్ద ఉన్న బీఎల్ ద్వారా ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఏమైనా మార్పులు ఉన్నా చేసుకోవచ్చన్నారు.