మహబూబ్ నగర్ జిల్లాను శుక్రవారం ఉదయం భారీగా మంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు అవస్థలు పడ్డారు. భారీగా మంచు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు వాహనదారులు చెబుతున్నారు. దీంతో దీపావళికి గ్రామాలకు వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.