మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కల ఉన్న కేఎస్ టింబర్ డిపోలో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. అదివారం అర్ధరాత్రి 3: 00 గంటల సమయంలో షాపు షెట్టర్ పగలగోట్టి లోనికి ప్రవేశించిన దొంగ వెంటనే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరికి పాల్పడ్డాడు. సోమవారం యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని జడ్చర్ల పట్టణ ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.