
ఉట్కూర్: ఘనంగా బికేస్ ఆవిర్భావ దినోత్సవం
రైతులు చైతన్యం అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అదే భారతీయ కిసాన్ సంఘ్ లక్ష్యమని సంఘం గ్రామ అధ్యక్షుడు నాగార్జున అన్నారు. ఆదివారం సాయంత్రం ఉట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. బలరామ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.