ఆత్మకూరు: విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాలని ఆహ్వానం
ఆత్మకూరు పట్టణంలో ఈనెల 12 నుండి మూడు రోజుల పాటు జరిగే అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరు కావాలని మంగళవారం అయ్యప్ప సేవ్ సమితి సభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిలను కలిసి ఆహ్వానించారు. అత్యంత వైభవంగా జరిగే ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పత్రికలు అందించారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి గోవర్ధన్, శ్రీనివాసులు, స్వాములు పాల్గొన్నారు.