నాగర్ కర్నూల్: విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

52చూసినవారు
నాగర్ కర్నూల్: విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
నాగర్ కర్నూల్ లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. జిల్లాలోని పలు పాఠశాలల నుంచి 512 సైన్స్‌ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి డీఈఓ రమేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు.
చదువుతో పాటు నూతన ఆవిష్కరణలు చేయడం వల్ల ఎందరో శాస్త్రవేత్తలు పుట్టుక వస్తారన్నారు.

సంబంధిత పోస్ట్