TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి నటుడు రానా వచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది.