అల్లు అర్జున్ తరపున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టులో నిరంజన్ రెడ్డి లెవనెత్తిన పాయింట్లకు ప్రభుత్వ తరుపున న్యాయవాది దగ్గర సమాధానం లేకండా పోయింది. ఈ సందర్బంగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కేసును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారని తెలిసింది. ఆయన వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతల కేసులను వాదిస్తుంటారు. ఘాజీ, క్షణం, ఆచార్య వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.