గుండెపోటుతో 9వ తరగతి బాలిక మృతి

64చూసినవారు
గుండెపోటుతో 9వ తరగతి బాలిక మృతి
TG: చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. తాజాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన నవ్య 9వ తరగతి చదువుతోంది. మంగళవారం ఆమె అస్వస్థతకు గురైంది. జ్వరం తీవ్రం కావడంతో బీబీనగర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ యశోదా శుక్రవారం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలిక గుండెపోటుతో చనిపోయింది.

సంబంధిత పోస్ట్