నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై దసరా ఉత్సవాలు

74చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు శనివారం నిర్వహించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. జమ్మి చెట్టుకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. వివిధ రకాల బాణా సంచా వెలుగులు ఉత్సవాలకు మరింత శోభాయమానంతో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రజలు , భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్