నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా శనివారం సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు వండిన భోజన నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, డైలి రిజిస్టరు ఖచ్చితంగా నిర్వహించాలని వాటిలో ఫుడ్ సూపర్వైజర్ తో పాటు మెస్ కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలని ఆదేశించారు.