సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నారాయణపేట పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరుకుంది. సోమవారం లక్ష్మి గణపతి, నవగ్రహ హోమాలు నిర్వహించారు. అన్ని విజ్ఞాలు తొలగి ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని హోమం నిర్వహించామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.