హోలీ పండగను ఆనందంగా జరుపుకోవాలి: ఎస్పీ

556చూసినవారు
హోలీ పండగను ఆనందంగా జరుపుకోవాలి: ఎస్పీ
హోలీ పండగను సాంప్రదాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. సోమవారం హోలీ సందర్భంగా జిల్లాలోని పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బందోబస్తు, ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. సహజమైన రంగులు వాడుతూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్