తండాలలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు

61చూసినవారు
తండాలలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు
మరికల్ మండలంలోని గాజులయ్య తాండా, బండ తాండా, బుడ్డగాని తాండా, నర్వ మండలంలోని జంగంరెడ్డి తాండా లలో గురువారం తనిఖీలు చేసినట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. తనిఖీల్లో 6 లీటర్ల సారాయి, 2, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్