నారాయణపేట పట్టణంలో పలు కాలనీల్లో, ఆలయాల్లో ప్రతిష్టాపన చేసిన వినాయకులను ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.