ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ శివశంకర్ అన్నారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని సూచించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అన్నారు.