ప్రమాదకరంగా బస్టాండ్ రోడ్డు

72చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో బస్టాండ్ కు వెళ్లే రహదారి గుంతలుపడి ప్రమాదకరంగా మారింది. బస్సులు లోపలికి ప్రవేశించే ప్రధాన రహదారి కావడంతో గుంతల రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు, డ్రైవర్లు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని బస్ డ్రైవర్లు, పట్టణవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్