వనపర్తి జిల్లా కేంద్రంలో మిలాద్ ఉల్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు శుక్రవారం ఊరేగింపు తీశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పచ్చ జెండాలతో డీజే పాటల మధ్య ఊరేగింపు కొనసాగింది. పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, యువకులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.