స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా వనపర్తి డిఆర్డిఓ ఏర్పాటు చేసిన బ్యానర్, సెల్ఫీ స్టాండ్ ను జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వార్ సోమవారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా బ్యానర్ పై అదనపు కలెక్టర్ తొలి సంతకం చేయగా, అనంతరం స్వచ్ఛత హీ సేవాలో జిల్లా అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వార్ మాట్లాడుతూ. స్వచ్ఛ భారత్ నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.