వనపర్తి జిల్లాలో డిసెంబర్ 14 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్ సునీత అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి ఎంఆర్ సునీత మాట్లాడుతూ. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, బ్యాంకు కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.