నిఖిల్ కుమారస్వామి గౌడకు తప్పని ఓటమి

55చూసినవారు
నిఖిల్ కుమారస్వామి గౌడకు తప్పని ఓటమి
కర్ణాటక ఉపఎన్నికలలో భాగంగా చెన్నపట్టణ నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడ ఓటమిపాలయ్యారు. కుమారస్వామి ఎంపీగా గెలవడంతో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నపట్టణ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసి అక్కడి నుంచి తన కుమారుడిని బరిలోకి దింపారు. దేవేగౌడ ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వరకే పట్టం కట్టారు. దీంతో జేడీఎస్‌కు కంచుకోట అయిన చెన్నపట్టణలో కాంగ్రెస్ పాగా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్